Monday, January 19, 2009

ఆరాటం

ఏమైంది నాకీ

రోజుమనస్సుపదే పదే వేగిర

పడుతోందిఅదేం ఖర్మో…ఇంకా తెలవారదేం!

రెండు మైళ్ళ దూరంఅలవాటు లేని ప్రయానం…

అలసిన శరీరం నిదురమత్తులోకి జారదేం?

ఓహ్…నిన్ను చూడాలనే ఆరాటంతోకునుకు రావడం లేదనుకుంటా!
నిదుర మత్తులో ఈ నగరంపసిపాప మోములా ప్రశాంతంగా

ఉందిఅక్కడక్కడ వినిపించే చిమ్మెటల సవ్వడి

అప్పుడప్పుడు వినిపించే గుడ్లగూబ

అరుపులుఇవి తప్ప అంతా

ప్రశాంతమేమరో అలికిడైనా లేని

వేళనా రాక నీకు తెలిసేదెలా?
ఆకసాన చందమామనై,

చందాంశు కిరణాలనునా చూపుగా మలచి,

సగం తెరచిన కిటికీ గుండా నిన్ను చూడాలని…

నీకూ నాకూ మధ్య దూరాన్నిపిల్ల తెమ్మరనై చెరిపెయ్యాలని…

ఎగసి పడే నీ కురులనిఅలవోకగా సరి చేయాలని…

వేకువలో వేగు చుక్కనైనీ వాకిటి ముందు వాలాలని…

నీలి మబ్బుల గొడుగు కిందనిదుర మత్తుని

పులుముకునిఒళ్ళు విరుచుకుంటూ మంచం దిగే నిన్నుచూడాలని ఒకటే ఆరాటం…

తొలి సంధ్య వేళవాకిట కళ్ళాపు చల్లి,

అణువణువూ మమేకమైపోతూ,

నాజూకు వేల్ల మధ్య నుండితెల్లని ముగ్గు ధారల్ని పోస్తూ,

తుంటరి గాలి చేసే

అల్లరికిఅలలా కదిలే

ముంగురులనిపైకి ఎగదోసినప్పుడు…

నీ నుదుటిపై అంటుకున్న

ముగ్గునినా అర చేత తుడవాలని…

అభ్యంగన స్నానం

చేసిఆరుబయట

తలారబెట్టుకుంటూఅద్దం ముందు

మెరుగులు దిద్దుకునేనీ పక్కన చేరి…

అల్లరి చేయాలనిమనసంతా ఒకటే ఆరాటం.
ఇప్పుడు…

వేకువ ఝాము కళ్ళాపులెక్కడ

ముని వాకిట ముత్యాల ముగ్గులెక్కడ

ఏసీలు వచ్చాక

తెరచిన కిటికీలెక్కడ

నా ఆశ నిరాశేగా!

No comments: